FbTelugu

తిరుపతిలో జగన్ సభ రద్దు

తాడేపల్లి: ఏపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన తిరుపతి బహిరంగ సభను రద్దు చేసుకుంటున్నట్లు ఆయనే ఇవాళ ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన సభలో పాల్గొనాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా రద్దు చేసినట్లు జగన్ తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న తరుణంలో సభ నిర్వహిస్తే విమర్శలు రావడంతో పాటు ఇతరత్రా సమస్యలు ఉండోచ్చనే నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే సభ రద్దు చేయడమే మేలు అనిపించిందని ఆయన తెలిపారు.

నేను వ్యక్తిగతంగా సభకు హాజరై మిమ్మల్ని ఓటు అడగలేకపోయినా, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏం చేసింది, చేస్తున్నది మీకు తెలుసనని అన్నారు. ప్రతి కుటుంబానికి ఏమేమి లబ్ధి కలిగిందో ఇప్పటికే లేఖలు రాసి పంపించానన్నారు. తిరుపతి వైసిపి ఎంపి అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని జగన్ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.