తిరుపతి: రాష్ట్రంలో ప్రజా పాలన కుంటుపడిందని, వైసీపీ పాలన అంతా రివర్స్ పాలసీతో నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా స్టిక్కర్ వేసుకొంటున్నదని ఆయన ఆరోపించారు.
తిరుపతిలో ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం ప్రారంభమైంది. సభకు అధ్యక్షత వహించి ప్రసంగించిన సోము వీర్రాజు ప్రసంగిస్తూ గత ముఖ్యమంత్రి కూడా కేంద్ర పథకాలకు స్టిక్కర్ వేసి చేసిన తప్పునే వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పలు యూనివర్సిటీలు, జాతీయ రహదారుల నిర్మాణంలో కేంద్రం అన్నింటా సహకారం అందిస్తూ వస్తుందన్నారు. బీజేపీ రైతుల పక్షం వహించే పార్టీ అని, వారికోసం ఎన్నో సంస్కరణలు చేసి రైతులకు ఆర్ధిక భరోసా కల్పిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక రైతుల ముసుగులో దేశంలో అలజడులు సృష్టిస్తుందని అన్నారు.
నిజమైన రైతు బిల్లులకు అనుకులంగా వుంటే తోక పార్టీలు ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయని వీర్రాజు ఆరోపించారు. ఆందోళలను రైతులు, ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి, కేంద్ర మంత్రి పీ.మురళీధరన్, సహా ఇంచార్జి సునిల్ దేవధర్, జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, రాజ్య సభ సభ్యులు ఙివిఎల్.నర్సింహారావు, సి.ఎం.రమేష్, ఎమ్మెల్సీలు, పివిఎన్. మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షులుచిలకం రామచంద్రరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు