అమరావతి: సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఢిల్లీలో అమిత్ షా అందుబాటులో లేకపోవడంతో పర్యటన రద్దయ్యింది.
ఇవాళ మధ్యాహ్నం జగన్ విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోవాల్సి ఉండగా, అమిత్ షా అందుబాటులో ఉండడం లేదని సమాచారం ఇచ్చారు. దీంతో తన పర్యటన వాయిదా వేసుకున్నారు. అమిత్ షా తో పాటు రాష్ట్ర సమస్యలపై ఇతర మంత్రులను చర్చించేందుకు ఢిల్లీ పర్యటన ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.