FbTelugu

గవర్నర్ తో జగన్ భేటీ

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ అయ్యారు.

బడ్జెట్ సమావేశాల తరువాత సీఎం జగన్ మర్యాద పూర్వకంగా కలిశారు. శాసన మండలిలో జరిగిన అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగిన రచ్చ, బిల్లుల పెండింగ్ పై ప్రధానంగా చర్చించారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు వెళ్లడం, ఖాళీ అయిన మంత్రి పదవులపై కూడా చర్చ వచ్చింది.
కరోనా కేసుల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు, విస్తృత పరీక్షలపై జగన్ వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు పై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే, తదనంతర పరిణామాలపై కూడా జగన్ చర్చించినట్లు తెలిసింది.

You might also like