FbTelugu

విద్యాశాఖ అధికారులతో నేడు జగన్ సమావేశం

అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో అనేక పరీక్షల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కు సడలింపులు ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

You might also like