FbTelugu

జగన్ మీడియా నీచాతి నీచం: ఎమ్మెల్సీ సంధ్య

తిరుపతి: కరోనా సోకిందని తప్పుడు ప్రచారం చేయడం, నీతి లేని రాజకీయాలు చేయడం సిఎం జగన్ రెడ్డికి, ఆయన మీడియాకు అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు.

ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ సాక్షి ఛానల్ లో ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కరోనా రాకున్నా.. కరోనా వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వారి వ్యక్తిత్వాన్ని అవమాన పరచడం జగన్ మీడియాకే చెల్లిందని వారు ఆరోపించారు. సాక్షి మీడియాకు నిజాలు రాసే దమ్ము, ధైర్యం లేదని ప్రజలకు తెలుసునని వారు స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ తప్పుడు కరోనా వార్తలతో జగన్ మీడియా మరింత దిగజారిపోయిందని దుమ్మెత్తి పోశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో.. చివరికి ఇంత నీచానికి దిగజారడం జగన్ రెడ్డికి, వారి మీడియాకు మాత్రమే చెల్లిందని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.