FbTelugu

కృష్ణానది కరకట్ట పనులకు జగన్ శంకుస్థాపన

విజయవాడ: కృష్ణానది కరకట్ట పనులకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇవాళ శంఖుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకు 15.5 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టనున్నారు.

రూ.150 కోట్ల లో ప్రకాశం బ్యారేజి వద్ద నున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కుడివైపు కృష్ణా కరకట్ట రోడ్డును విస్తరించనున్నారు. అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిధులతో జలవనరుల శాఖ ద్వారా ఈ పనులు జరగనున్నానయి. మొత్తంగా 15.525 కి.మీ పొడవునా రోడ్డును వెడల్పు చేస్తారు. 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసలు వాహనాలు వెళ్లడానికి, మరో రెండు వరుసలు ఇరువైపులా నడకదారులను నిర్మిస్తున్నారు. ఈ రహదారిలో కొండవీటి వాగు బ్రిడ్జిని పునర్‌నిర్మించడం, వెంకటాయపాలెం, రాయపూడి అవుట్‌ఫాల్‌ స్లూయిస్, వరద పర్యవేక్షణ కేంద్రాలను నిర్మించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.