FbTelugu

జగన్ కు మహిళలంటే గౌరవం: రోజా

తిరుమల: రాఖీ పండగ సందర్భంగా మహిళల భద్రతకు సీఎం జగన్ మరో ముందడుగు వేశారని ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామ‌ని రోజా పేర్కొన్నారు.
సోమవారం ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దిశా చట్టాన్ని తీసుకురావడం ద్వారా మహిళల పై ఎంత గౌరవం ఉందో తెలుస్తోంద‌ని ఆమె అన్నారు. మహిళలకు 50 శాతం హక్కు కల్పించడమే కాకుండా, ఓ మహిళకి హోం మంత్రి పదవి ఇచ్చారు. ఎస్టీ మహిళకు డిప్యూటీ సీఎం పదవి కల్పించాని ఆమె తెలిపారు.

గాజువాకలో జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్‌ని‌ చిత్తు చిత్తుగా ఓడించారని రోజా అన్నారు. అందుకే వైజాగ్‌పై పవన్‌ కసి పెంచుకున్నారా? ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు తన బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.
సెంటిమెంట్ నిరూపించుకోవాలంటే ఎవరైతే ఆ సెంటిమెంట్ నమ్ముతారో వారు రాజీనామా చేసి వారి చిత్తశుద్ధి చూపించాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రోజా స్పష్టం చేశారు.

You might also like