FbTelugu

మా డిమాండ్లపై జగన్ సానుకూలం: చిరంజీవి

తాడేపల్లి: థియేటర్లలో టిక్కెటింగ్ పారదర్శకత ఉండాలని సీఎం జగన్ ను కోరామని హీరో చిరంజీవి తెలిపారు. సినిమాలను పట్టి టిక్కెట్ ధరలు చెన్నై, ముంబై నగరాల్లో అమల్లో ఉందని చెప్పామన్నారు.

ఇవాళ తాడెపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ రెడ్డిని కలిశామన్నారు. కరోనా కారణంగా షూటింగ్ లు ఆగిపోయాయి, తెలంగాణలో షూటింగ్ లకు అనుమతించారని చిరంజీవి అన్నారు. ఏపీలో కూడా అనుమతించేందుకు సీఎం జగన్ రెడ్డ అంగీకరించారు.

లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. మినిమమ్ కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని కోరగా, అంగీకరించిన సీఎం జగన్ కు సినీ పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలిపారు. 2019-20 సంవత్సరం నంది అవార్డులను బహూకరించాలని కోరగా, అంగీకరించారని అన్నారు. ఈ ఏడాదే నంది అవార్డుల బహూకరణ కార్యక్రమం ఉంటుందన్నారు.

సంవత్సర కాలంగా కలవాలని అనుకుంటున్నాం. ఈ రోజు కలిశామన్నారు. చిరంజీవి వెంట నాగార్జున, ఎస్ఎస్.రాజమౌళి, సురేష్ బాబు, పొట్లూరు వరప్రసాద్, దిల్ రాజు, సీ.కళ్యాణ్ కలిశారు.

You might also like