రాష్ట్రంలో మాస్కులు లేవని ప్రశ్నించిన దళిత డాక్టర్ సుధాకర్ రావు ను వేధిస్తున్నారు. చివరకు చంపేస్తాం అని బెదిరించారంటూ సీఎం జగన్ రెడ్డి పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ లో తూర్పారపట్టారు.
ఒక గొప్ప ప్రభుత్వ డాక్టర్ ను పిచ్చివాడుగా ముద్రవేసి, జగన్ రాక్షసానందం పొందుతున్నారు. నాన్న ని చంపింది రిలయన్స్ కంపెనీ వాళ్లు అని ఆనాడు రెచ్చగొట్టి అమాయక దళిత బిడ్డలను జైలుకు పంపాడు. మొన్న అదే రిలయన్స్ కంపెనీ ప్రతినిధికి రాజ్యసభ్య సీటు ఇచ్చి దళితులను దగా చేసాడు. సీఎం అయ్యాకా అధికార మదంతో దళితుల పై వరుస దాడులకు పాల్పడుతున్నారు.
జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న దళిత వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్,మహాసేన రాజేష్ ను అక్రమంగా అరెస్ట్ చేసారు.