FbTelugu

సుప్రీంకోర్టులోనూ జగన్ కు ఎదురుదెబ్బ

ఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లో ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు  నిరాకరించింది.

ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు జడ్జీ ల ధర్మాసనం ఈ కేసును విచారించింది. స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాలలో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజ్యాంగ పదవులతో ఆటలాడుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. ఆర్డినెన్స్ జారీలో ప్రభుత్వ ఉద్దేశాలు నమ్మదగినవిగా లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించలేదు.

ఏపీ హైకోర్టు ఇచ్చిన 320 పేజీల తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రమేష్ కుమార్ ను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఎస్ఎల్పీ దాఖలు చేసింది.

You might also like