FbTelugu

14న తిరుపతిలో జగన్ ప్రచారం

తాడేపల్లి: తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ వెళ్లేందుకు షెడ్యూలు ఖరారు అయ్యింది. ఈనెల 14వ తేదీన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సిఎం హోదాలో మొదటి సారి ప్రజల్లోకి వస్తున్నారు. తిరుపతి లోకసభ పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఆశించిన మేరకు లేదని పార్టీ వర్గాల నుండి సమాచారం అందింది. ఏపీ ఇంటెలిజెన్స్ నివేదిక లో కూడా ఇదే సమాచారం ఉన్నట్లు తెలిసింది. దీంతో తానే ప్రచారానికి వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారు. మరోవైపు హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తారని వైసిపి వర్గాలు అంటున్నాయి. తిరుమలలో తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ ప్రచారం తప్పనిసరి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ముఖ్య నాయకులు తిరుపతిలో మకాం వేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.