FbTelugu

జ‌గ‌న్ తూటా యూట‌ర్న్‌!

మాకే ఎందుకిలా జ‌రుగుతుంది. మేం చేసిన త‌ప్పేమిటీ. ఏడాదిపాల‌నలో రూ.45వేల కోట్ల‌రూపాయ‌లు సంక్షేమ ప‌థ‌కాలు కుమ్మ‌రించాం.

అవినీతి ర‌హిత పాల‌న అందిస్తున్నాం. కుల‌, మ‌త ప్ర‌స్తావ‌న లేకుండా స‌మ‌న్యాయం చేస్తున్నాయి. అయినా.. మా వైసీపీ ఎందుకీ ఎదురుదెబ్బ‌లు తింటుంది. ఇదంతా స్వ‌యంకృతాప‌రాధ‌మా.. ఎవ‌రైనా చేత‌బ‌డి చేశారా! ఇదీ వైసీపీ నేత‌ల ప‌రిస్థితి. మొన్న‌టికి మొన్న‌.. హైకోర్టు త‌ర‌చూ ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు వేయ‌టంపై కొంద‌రు వైసీపీ అభిమానులు, నేత‌లు అందులో ఎంపీలు కూడా ఉన్నార‌నుకోండి.

వీరంతా.. కోర్టు తీర్పును త‌ప్పుబ‌ట్టారు. పైగా న్యాయ‌మూర్తుల ప‌ట్ల చేయ‌కూడ‌ని కామెంట్స్ చేశారు. త‌ప్పొప్పుల విచ‌క్ష‌ణ మ‌ర‌చి మ‌రీ సోష‌ల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు.. ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌నర్ గా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌ను కొన‌సాగించాలంటూ సుప్రీంకోర్టు స్ప‌ష్టంచేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పాటించాలంటూ ఏపీ స‌ర్కారును సున్నితంగా హెచ్చ‌రిస్తూనే ఆదేశాలు జారీచేసింద‌ట‌.

వాది, ప్ర‌తివాదుల‌కు నోటీసులు జారీచేసి స‌మాధానం చెప్పేందుకు రెండువారాల స‌మ‌యాన్ని గ‌డ‌వుగా ఇచ్చారు. టీడీపీ లెక్క‌ల ప్ర‌కారం.. ఇప్ప‌టికీ 66అంశాలు. అంటే.. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. ఇప్పుడు నిమ్మ‌గ‌డ్డ విష‌యంలో రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా ఆర్డినెన్స్‌తీసుకురావ‌టాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇది ఓ విధంగా భాజ‌పాకు కూడా గుణ‌పాఠ‌మే. గ‌వ‌ర్న‌ర్ హోదాలో ఉన్న వ్య‌క్తి ఇక్క‌డే తన విచ‌క్ష‌ణాధికారాలు వాడాల్సి ఉంది. కానీ ఎందుకో దాన్ని తాత్సారం చేశార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఇది ఓ విధంగా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల స‌మ్మ‌తితోనే జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల‌కు బ‌లాన్నిస్తుంది.

వైసీపీను వెనుక నుంచి ప్రోత్సహిస్తున్న బీజేపీ తాను కూడా ఊబిలోకి దిగుతున్న‌ట్టు మ‌ర‌చిపోయంది. టీడీపీపై క‌క్ష‌తో వైసీపీను వెనుకేసుకురావ‌టం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ త‌ర‌పు బోలెడంత మంది ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు, వారికి సహాయ‌కులు.. న్యాయ‌కోవిధులు ఇలా చాలామంది స‌ర్కారు సొమ్ము తీసుకుంటున్నారు. కానీ ప్ర‌భుత్వం త‌ర‌పు నిర్ణ‌యం స‌రైన‌దే అనే వాద‌న వినిపించ‌లేక‌పోతున్నారు. ఫ‌లితంగా ప్ర‌తిసారీ వైసీపీ ప్ర‌భుత్వ‌మే విమ‌ర్శ‌లు.. చీవాట్లు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటూ వైసీపీ వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నాయ‌ట‌.

ఏమైనా.. కాలం క‌ల‌సి వ‌చ్చి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి ఇంగ్లిషు మీడియం, అమ‌రావ‌తి రాజ‌ధాని త‌ర‌లింపు, భూముల విక్ర‌యం, మొన్న మాజీ డీజీపీపై స‌స్పెన్ష‌న్‌వేటు. జాస్తిర‌మేష్‌కు డిమోష‌న్‌, నిమ్మ‌గడ్డ ర‌మేష్‌కుమార్ తొల‌గింపు.. ఇలా ప్ర‌భుత్వం టీడీపీ అనుకూలురు అని భావించిన వారిపై త‌న అధికారాన్ని ప్ర‌యోగించ‌బోతే విక‌టించి తిరిగి స‌ర్కారు చెంప చెళ్లుమన‌టం విశేష‌మే.

You might also like

Leave A Reply

Your email address will not be published.