FbTelugu

జగన్ అక్రమాస్తుల కేసులో మరో మలుపు

Jagan-assets-case-another-turn-

హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఐఏఎస్ సీవీఎస్ కే. శర్మ పై తాజాగా మరో కేసు నమోదు అయింది. శర్మ పెట్టిన బిల్లులను సరిగ్గా పరిశీలించకుండానే ఆనాటి ఉమ్మడి రాష్ట్ర సీఎస్ పీకే. మహంతి సంతకాలు చేశారని రమణ సైఫాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ చేతివాటంపై కేసు నమోదు చేయాలని పీవీ. రమణ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నుండి న్యాయ సహాయం పొందిన ఆయన నకిలీ బిల్లులు సృష్టించి లక్షల రూపాయలు మింగారంటూ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదుదారుడు తెలిపారు. బిల్లుల విడుదల విషయంలో మాజీ సీఎస్ పీకే మహంతి, మాజీ రెవెన్యూ కార్యదర్శి పి వి రమేష్ సహకరించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు ఐఏఎస్ లకు అప్పటి ప్రభుత్వం న్యాయ సహాయానికి నిధులు విడుదల చేసింది. అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి శర్మ ప్రభుత్వానికి న్యాయ సహాయ బిల్లులు అందజేయడంలో చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు బిల్లులతో లక్షల రూపాయల నిధులు విడుదల చేశారు.

You might also like