FbTelugu

జగనన్న సంకల్పం ఆడియో సాంగ్స్ విడుదల

గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు.

జగన్ అన్న సంకల్పం చిత్ర ఆడియో సాంగ్స్ ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ, నేడు జగనన్న సంకల్పం అనే పేరుతో సినిమా తీయడం, సాంగ్స్ రిలీజ్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. యువ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తల రాతలను మారుస్తున్నాడన్నారు. యువతకు ముఖ్యమంత్రి ఆదర్శంగా నిలుస్తున్నారు. చిత్ర దర్శకుడు రుద్ర కిరణ్ కి మా హృదయ పూర్వక అభినందనలు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని వారి అందరికి ముఖ్యమంత్రి ఆసరా గా నిలుస్తున్నారు.

హోం మినిస్టర్ సుచరిత మాట్లాడుతూ, గుంటూరు లో జగనన్న సంకల్పం అనే చిత్ర ఆడియో లాంఛ్ చేయడం చాలా ఆనందదాయకం అన అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ  అభివృద్ధికి ముఖ్యమంత్రి బాటలు వేస్తున్నారని సుచరిత తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.