FbTelugu

18న జగమే తాందిరం విడుదల

తమిళ హీరో ధనుష్ నటించిన జగమే తాందిరం సినిమా రిలీజు ముహూర్తం ఖరారు అయ్యింది. కరోనా కారణంగా థియేటర్ల బదులు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజు చేస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం (జూన్ 18)న నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని థియేటర్ లో విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూసివేసి ఉండడంతో ఒటిటి లో విడుదల అవుతోంది. 190 దేశాల్లో 17 భాషల్లో ఒకేసారి రిలీజు చేసేందుకు నెట్ ఫ్లిక్స్ ఏర్పాట్లు చేసింది. తెలుగు భాషలో జగమే తంత్రం అని పేరు పెట్టారు. 18వ తేదీ మధ్యాహ్నం 12,30 గంటల నుంచి సినిమా స్ట్రీమ్ అవుతుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.