FbTelugu

కమ్యూనిస్టు దేశం కన్నెర్ర… అలీబాబా విలవిల!

బీజింగ్: చైనా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపడంతో పాటు… బ్యాంకులు తాటట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఏ రోజు అన్నాడో.. అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి.
అప్పటి నుంచి చైనా ప్రభుత్వం జాక్ మా కు సంబంధించిన కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధిస్తోంది. చైనా ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో జాక్ మా విలవిల్లాడుతున్నారు. ఆయన వ్యాపార సంస్థలపై నియంత్రణా సంస్థలతో నిఘా పెట్టించి చర్యలు చేపట్టింది. తొలుత 37 బిలియన్ డాలర్ల విలువ చేసే యాంట్ గ్రూప్ ఐపిఒను అడ్డుకున్నది. ఈ పరిమాణాలకు కిన్నుడైన జాక్ మా బాహ్య ప్రపంచానికి కన్పించకుండా వెళ్లిపోయారు. కొద్ది వారాల తరువాత కన్పించారు.

తనకు పోటీ లేకుండా చేసుకునేందుకు అనేక వ్యూహాలను రచిస్తోందని చైనా మార్కెట్ రెగ్యులేషన్ ఆరోపిస్తున్నది. తాజాగా గుత్తాధిపత్య వ్యతిరేక చర్యల్లో భాగంగా అలీబాబాపై 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విదించింది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న గ్రూపు పరిస్థితి పేనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. ఈ చర్యలతో చైనాలో అపర కుబేరుల జాబితాలో తొలి స్థాన్ని కోల్పోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.