FbTelugu

షూటింగ్ కాదు యాక్సిడెంటే

చెన్నై: ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని చూస్తే ఎవరైనా సినిమా షూటింగ్ స్పాట్ అనుకుంటారు. కాని భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, పది మంది గాయపడ్డారు.

ఇవాళ ధర్మపురి-సేలం హైవే పై అతి వేగంతో వస్తున్న సిమెంట్ లారీ అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న వాహనాలపై దూసుకు వెళ్లిన ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో పది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో పదిహేను వాహనాలు పూర్తిగా ధ్వంసమై షూటింగ్ ప్రాంతాన్ని తలపించేలా ఉంది. ఘటనా స్థలంలో గాయపడిన వారిని సేలం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలానికి పోలీసులు చేరుకు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు తరలించడంతో పాటు ఆ ప్రాంతంలో నుజ్జు నుజ్జు అయిన వాహనాలను తరలించే పనులు ముమ్మరం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.