FbTelugu

కష్టకాలంలో శ్రమజీవులకు అండగా ఉంటాం: మోదీ

న్యూఢిల్లీ: కష్టకాలంలో శ్రమజీవులకు అండగా ఉంటామని భారత ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. 116 జిల్లాలలో ఈ పథకం అమలు చేయనున్నట్టు తెలిపారు.

వలస కూలీలకు స్వస్థలాలోనే ఉపాధి కల్పిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులకు ఉపాధే ఈ పథకం లక్ష్యమని అన్నారు. దేశ వ్యాప్తంగా వలస కూలీల కోసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం ప్రారంభానికి కార్మికులే స్ఫూర్తి అన్నారు. భారత సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు.

You might also like