FbTelugu

ఇటలీలో జనవరి నుంచే వ్యాక్సిన్లు

మిలన్: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే తప్ప వైరస్ ను నియంత్రించడం అసాధ్యమని ఇటలీ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి నుంచి దేశ పౌరులకు వ్యాక్సిన్లు ఇవ్వాలని తీర్మానించింది.

జనవరి వరకు వ్యాధి తీవ్రత మరింత ముదరకుండా ఉండేందుకు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. ప్రపంచంలో అత్యధికంగా కరోనా బారిన పడుతున్న వారిలో బ్రిటన్ ముందు వరుసలో ఉండగా రెండో స్థానంలో బ్రిటన్ ఉంది. కొద్ది రోజులుగా రెండో దశ విజృంభిస్తుండడంతో ప్రభుత్వం వ్యాక్సిన్ వైపే మొగ్గు చూపుతున్నది. దేశంలో 1.6 మిలియన్ల మందికి వ్యాక్సిన్ సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జనవరిలో ప్రారంభించి సెప్టెంబర్ 2021 నాటికి అందరికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ దేశ వైరస్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం కమిషనర్ డొమినికో ఆర్. క్యూరీ వెల్లడించారు. తొలి ప్రాధాన్యం మెడికల్ సిబ్బంది, వృద్ధులు, వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు.

ఫైజర్ కంపెనీ దేశ ప్రజలందరికీ సరిపడా వ్యాక్సిన్లను జవవరి రెండో వారంలో అందచేయనున్నట్లు ఇప్పటికే సమాచారం పంపించింది. వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రజలను సన్నద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ వరకు గడువు పెట్టుకున్నా, జూన్ చివరి నాటికే అందరికీ ఇవ్వనున్నారు. వీటికి అవసరమైన డిస్పొజబుల్ ఇంజెక్షన్లు, కూలింగ్ కిట్లు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.