FbTelugu

సర్కార్ రేటుకే కరోనా చికిత్స: ఈటల స్పష్టీకరణ

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రైవేటు హాస్పిటళ్లు, నర్సింగ్ హోం లు చికిత్స చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించి అధిక డబ్బులు వసూలు చేసే చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ రోజు ప్రైవేటు మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్ యాజమాన్యాలతో సమావేశం అయిన తరువాత మంత్రి ఈటల రాజేందర్ మీడియా తో మాట్లాడారు. తమకు సరిపడా పరికరాలు, ఆక్సిజన్ సరఫరా చేయాలని వారు కోరగా అంగీకరించామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు అనగానే దోచుకుంటాయనే పరిస్థితి వద్దు, మానవత్వంతో వ్యవహరించాలని సూచించినట్లు చెప్పారు. కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఏపీ, మహారాష్ట్రలలో కరోనా కేసులు పెరిగాయన్నారు. దీని ప్రభావంతో తెలంగాణ లో కూడా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసుల సంఖ్య పెరిగినా… వైరస్ తీవ్రత తక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారని ఆయన అన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో బెడ్స్ అందుబాటులో ఉంచాలని వాళ్ళని కోరామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

సాధారణ జీవితం కొనసాగించాల్సిందేనని, అందరూ కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని అన్నారు. ప్రతి ఇల్లు ఔషధాలయంగా పనిచేయాలని, వ్యాక్సిన్లు, ట్రీట్ మెంట్ ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంది. పిపీఈ కిట్స్ వేసుకోకుండానే కరోనా పేషంట్స్ దగ్గరకి వెళ్లి వైద్యం చేస్తున్నారని, ఇప్పుడా భయం పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆరోగ్యం బాగుందని.. వైరస్ లక్షణాలు లేవన్నారు. కరోనా వ్యాప్తి వేగంగా ఉంది కానీ తీవ్రత తగ్గింది అని అన్నారు. ప్రభుత్వ పరిధిలో సరిపడా పడకలు, వైద్యులు ఉన్నారని ప్రజలకు భరోసా ఇచ్చారు. 50 పడకలకు మించి ఉన్న హాస్పిటళ్లలో శక్తి మేరకు చికిత్స అందిస్తున్నారని మంత్రి ఈటల తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.