FbTelugu

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా!: ఈటల

హైదరాబాద్: కారు గుర్తుపై గెలిచానని సిఎం కెసిఆర్ చెబితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీరు బి ఫారం ఇచ్చారు, కెసిఆర్ చెప్పిన వెంటనే రాజీనామా పత్రం సమర్పిస్తానని ఆయన తెలిపారు.
ఇవాళ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, గత మూడు రోజులుగా నా ఇంటి చుట్టూ వేలాది మంది పోలీసులు మోహరించారన్నారు. మంత్రి పదవి తీసేశారని, ఆ తరువాత బర్తరఫ్ చేశారని అన్నారు. ఈరోజు అరెస్టు చేస్తారని ప్రచారం మొదలు పెట్టారని టిఆర్ఎస్ టివి ఛానళ్లు, పత్రికలు రాతలు రాస్తున్నాయని ఆయన ఆరోపించారు. టిఆర్ఎస్ లో చేరింది మొదలు మీ వెంటే తిరిగాను, నా వ్యాపారాలు మొత్తం నా భార్య జమునా రెడ్డి చూసుకుంటున్న విషయం మీకు తెలుసునని ఆయన తెలిపారు. ఒక మహిళా పారిశ్రామికవేత్త ను వేధించడం తగునా అని ఆయన కెసిఆర్ ను ప్రశ్నించారు. నా ఆస్తులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని ఈటల డిమాండ్ చేశారు.
దేవరయాంజాల్ లో నమస్తే తెలంగాణ పత్రిక ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేస్తే నా భూమిని తనఖా పెట్టి బ్యాంకు రుణం తీసుకున్నారని, రుణం తీర్చిన తరువాత నా డాక్యుమెంట్లు వెనక్కి తీసుకున్నానని ఆయన వివరించారు.

పార్టీలో చేరిన తరువాత ఎన్నో భూములు విక్రయించానని, ఆ విషయం కెసిఆర్ కు తెలుసునని అన్నారు. పార్టీలో చేరక ముందు చెమట చుక్కలు చిందించి ఆస్తులు సంపాదించానని, ఆ తరువాత నా భార్య కొనసాగించిందన్నారు. జమునా హేచరీస్ వ్యాపారం వార్షిక టర్నోవర్ రూ.300 పైగానే ఉందన్నారు. అచ్చంపేట, హకీంపేటలో తన భూములపై జిల్లా కలెక్టర్ తప్పుడు రిపోర్టులు పంపించానన్నారు. ప్రభుత్వం ఎలా చెబితే అలా అధికార యంత్రాంగం రిపోర్టులు తయారు చేస్తుందనే విషయం ప్రజలకు తెలిసిందన్నారు. గ్యాంగ్ స్టర్ నయిం కే భయపడలేదని, కెసిఆర్ కు భయపడతాడని అనుకోవడం భ్రమ అని ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. ప్రభుత్వ రిపోర్టులో పేర్కొన్న విధంగా అసైన్డు భూములను రిజిష్టర్ చేస్తే ఏ చర్యకైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.