FbTelugu

డబ్బులు, దౌర్జన్యంతో గెలువలేరు: ఈటల

హుజూరాబాద్: డబ్బులు, దౌర్జన్యంతో కెసిఆర్ గెలవలేవని, కెసిఆర్ కు ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ లో కౌరవులకు పాండవులకి మధ్య యుద్ధం జరగనుందని సవాల్ విసిరారు.
శాసన సభ్యత్వానికి రాజీనామా ప్రకటించిన తర్వాత ఇవాళ ఈటల రాజేందర్ మొదటి సారి కమలాపూర్ కి వచ్చారు. శంభుని పల్లి, కానిపర్తి లలో మెదలైన జైత్రయాత్ర కమాలపూర్ వరకూ సాగింది. వందల కోట్లతో బ్లాక్ మెయిల్ చేసినా ప్రజల్ని ఎవరూ కొనలేరని ఈటల స్పష్టం చేశారు.

తెలంగాణ మొత్తం ఉద్యమానికి కరీంనగర్ కేంద్రం అయితే కరీంనగర్ కి కమలాపూర్ ప్రధానమైందన్నారు. కెసిఆర్ పాలనలో ప్రజాస్వామ్యానికి, ఆత్మగౌరవానికి తెలంగాణలో ఛాన్స్ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. ఉద్యమంలో పాల్గొని నిర్లక్ష్యానికి గురైన వారు అందరూ హుజురాబాద్ లో మరలా ఎన్నిక వస్తే రావడానికి సిద్ధమని చెప్పారు. కొందరు నాయకులు టిఆర్ఎస్ పార్టీకి తొత్తుల్లా వ్యవహరుస్తున్నారని, వారిని రాజకీయ బొంద పెట్టడం ఖాయమన్నారు. రాబోయే కాలంలో ధర్మానిదే విజయమన్నారు. పులి బిడ్డల్లా యువకులు సిద్ధం గా ఉన్నారని, తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసే వరకూ విశ్రమించనన్నారు. ఉద్యమ కారులేవరో ఉద్యమ ద్రోహులేవరో ప్రజలు తేల్చుకుంటారని ఈటల అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.