FbTelugu

బిజెపిలో చేరడం లేదు: ఈటల రాజేందర్

హైదరాబాద్: బిజెపి పార్టీలో చేరుతున్న కొందరు చేస్తున్న ప్రచారాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో చేరేది లేదని ఆయన ఖండించారు.

మద్ధతు కోరేందుకే బిజెపి నేతలను కలిశానని, ఇతర పార్టీల నేతలను కూడా కలుస్తున్నానని ఈటల రాజేందర్ వివరించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీయాచేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. రాజీనామాపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ఏ పార్టీలో చేరడం లేదని, ఇండిపెండెంట్ గానే ఉంటున్నట్లు ఆయన వివరించారు. బిజెపిలో, కాంగ్రెస్ లో చేరుతున్నారని కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. వీటి వెనకాల అధికార పార్టీ హస్తం ఉందని ఈటల అభిమానులు ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ ఓటర్లలో గందరగోళం సృష్టించేందుకు టిఆర్ఎస్ పెద్దలు సోషల్ మీడియాలో వార్తలు వదులుతున్నారని, ప్రజలకు కూడా తెలుసని ఈటల వర్గీయులు అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.