FbTelugu

సీఎం కేసీఆర్,కేటీఆర్ కలవడం లేదు: ఈటల

హైదరాబాద్: సీఎం కేసీఆర్,కేటీఆర్ అప్పాయింట్ కోసం మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నానని, పర్సనల్ మొబైల్ కు ఫోన్ చేసినా స్పందించలేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసైన్డు భూములు కొనుగోలు చేశారని, కబ్జాలు చేశారని నిందలు వేసే బదులు పిలిచి అడిగితే వివరాలు చెప్పేవాడిని కదా అని అన్నారు. టిఆర్ఎస్ టివి ఛానళ్లు, న్యూస్ పేపర్లలో బురద జల్లే వార్తలు రావడం బాధాకరమన్నారు. ఈ వార్తలను సభ్య సమాజం అసహ్యించుకుంటోందన్నారు. అయినా తను బెదిరేది లేదని, విచారణ కమిటీ రిపోర్టు వచ్చిన తరువాత భవిష్యత్తుపై ఆలోచన చేస్తానని రాజేందర్ తెలిపారు

హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. కరోనా సమయం కాబట్టి ఎవరు కూడా హైదరాబాద్ కి రావద్దని, హైరానా పడవద్దన్నారు. మరోవైపు శామీర్‌పేట్‌లోని మంత్రి ఈటల నివాసానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ఈటలకు అనుకూలంగా నినాదాలు చేశారు. రాజీవ్ రహదారిపై ఆయన అభిమానులు రాస్తారోకోలు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.