FbTelugu

ఈటల విమానానికి తప్పిన ప్రమాదం

న్యూఢిల్లీ: బిజెపి నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందానికి ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి వస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫైలట్ అలెర్ట్ అవ్వడంతో ముప్పు తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

న్యూఢిల్లీ ఏయిర్ పోర్టు లోఇవాళ ఉదయం టేకాఫ్ సమయంలో రన్ వేపై సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించాడు. గాల్లోకి లేచే సమయంలో సాంకేతిక సమస్యను గుర్తించి వెంటనే మరమ్మత్తు కోసం ఆపేశారు. సాంకేతికంగా సమస్యను పరిష్కరించిన తరువాత తిరిగి ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఈ విమానంలో బిజెపి ఎమ్మెల్యే రఘనందన్, మాజీ ఎంపి జి.వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పి చైర్ పర్సన్ తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది విమానంలో ఉన్నారు.
ఏయిర్ పోర్టు రోడ్డులో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ ఏయిర్ పోర్టు రోడ్డు లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఢిల్లీ నుంచి వస్తున్న ఈటల రాజేందర్ కు ఘన స్వాగతం పలికేందుకు భారీగా ఏయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.