FbTelugu

బిజెపిలో చేరిన ఈటల రాజేందర్

న్యూఢిల్లీ: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపి కండువా కప్పుకున్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈటల రాజేందర్ కు పుష్పగుచ్చం అందచేసి పార్టీలోకి ఆహ్వానించారు.
బిజెపి జాతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బిజెపి తెలంగాణ వ్యవహారాల్ ఇన్ ఛార్జీ తరుణ్ చుగ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డికె.అరుణ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో అన్ని జిల్లాల నుంచి చేరికలు ఉంటాయని అన్నారు.

తెలంగాణల పార్టీ పురోభివృద్ధికి తనవంతుగా పాటుపడతానని అన్నారు. విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తానన్నారు. తెలంగాణలో బీజేపీ నీ అన్ని గ్రామాలకు తీసుకొని వెళ్ళడానికి శ్రమిస్తానని తెలియజేస్తున్నాను. కెసిఆర్ ను ఎదుర్కొనే పార్టీ, ఉద్యమకారులకు బిజెపి వేదిక కాబోతున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో గడీల పాలన ను బద్దలు కొడతామని ఆయన పునరుద్ఘాటించారు. ఈటల తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఆర్టీసి నాయకుడు అశ్వత్థామ రెడ్డి, మాజీ ఎంపి రమేష్ రాథోడ్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.