FbTelugu

14న బిజెపిలోకి ఈటల రాజేందర్

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14వ తేదీన కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

ఈటల రాజేందర్ తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పి చైర్ పర్సన్ తుల ఉమ కూడా పార్టీలో చేరనున్నారు. ఇవాళ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ చుగ్ హాజరయ్యారు. 14వ తేదీన రాజేందర్ పార్టీలో చేరుతున్నారని ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.