FbTelugu

ఈటల భూములపై విచారణ షురూ

మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు ఇవాళ ఉదయం నుంచే మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జాపై విచారణ ప్రారంభం అయ్యింది. ఏసిబి, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, రెవెన్యూ అధికారులు అచ్చంపేట గ్రామానికి చేరుకున్నారు.

మంత్రిపై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. తూప్రాన్ ఆర్డీఓ రాం ప్రకాశ్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలతో గ్రామంలోని భూములను డిజిటల్ సర్వే చేయిస్తున్నారు. అసైన్డు భూముల్లో మంత్రి ఈటల భార్య జమునా రెడ్డి పేరుతో హేచరీస్ ఏర్పాటు చేశారు. ఈ భూముల్లో పట్టా భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అసైన్డు భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయనేది ఇవాళ లెక్క తేల్చనున్నారు. అచ్చంపేట, హకీంపేట, మసాయిపేట గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.