FbTelugu

విపక్షాలతో ఈటల రాజేందర్ సంప్రదింపులు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కెసిఆర్ చేతిలో బర్తరఫ్ కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ విపక్ష పార్టీల నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు.
బంజారాహిల్స్ లోని మినిష్టర్స్ క్వార్టర్స్ కు వెళ్లి విక్రమార్కను కలిశారు.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు కరోనా కల్లోలం, ప్రభుత్వం నిర్లక్ష్యంపై చర్చించుకున్నారు. ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. ఆ తరువాత సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. స్థానిక టిఆర్ఎస్ కార్యకర్తలు, నేతలతో చర్చించిన ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌లో పలువురు ముఖ్యులను కలవాలని నిర్ణయించిన ఆయన భట్టి విక్రమార్కతో సమావేశమైనట్లు తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.