FbTelugu

ప్రభాస్ పెళ్లి పిలుపునకు రెండేళ్లు ఆగాల్సిందే!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. హీరోలు రానా, నితిన్ లు వివాహం చేసుకోవడంతో, హీరో ప్రభాస్ రాజు కూడూ పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి.

కుటుంబం ఒత్తిడి ఉన్నా… రెండేళ్ల వరకు సినిమాలు ఉండడంతో ఇప్పట్లో పెళ్లి చేసుకునే సూచనలు కన్పించడం లేదు. ఒక్కరోజు ఖాళీ లేకుండా రెండేళ్ల వరకు భారీ సినిమాలకు కాల్షీట్లు బుక్ చేయడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. కనీసం పెళ్లి కార్యక్రమాలకు రెండు వారాల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పెళ్లి పిలుపు వినాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందేనంటున్నారు.

పాన్ ఇండియా స్టార్ గా తన స్థాయిని మరింతగా పెంచుకునేందుకు వృత్తి పైనే దృష్టి సారించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

You might also like