FbTelugu

రానున్న 4 రోజులు వర్షాలు

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రానున్న 4 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది
తూర్పు, పడమర మధ్య విస్తరించిన ద్రోణి ఆదివారం ఉత్తర కోస్తాపై ఉంటుందని ప్రకటించింది.

అలాగే, 4న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో అరేబియా సముద్రంలో రుతుపవనాలు బలపడనున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ కారణంగా మంగళవారం నుంచి 3-4 రోజులు దక్షిణ, మధ్యభారతంలో వర్షాలు కురుస్తాయని, కోస్తాలో వర్షాలు పెరగనున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది.

You might also like