FbTelugu

ఏపిలో రానున్న 4 రోజులు వర్షాలు

అమరావతి: తూర్పు, ఈశాన్య బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో భారీగా వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం వాయవ్య బంగాళాఖాతం పరసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నదని విశాఖటపట్నం వాతావరణ విభాగం ప్రకటించింది.

తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుండడంతో పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ, ఒడిశా మీదుగా పయనిస్తుంది. రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14 వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. రానున్న నాలుగు రోజుల పాటు కోస్తా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.