FbTelugu

తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు

హైదరాబాద్: అల్ప పీడనం ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. శుక్రవారం, శనివారం నాడు కుండపోతగా వర్షాలు కురవొచ్చని ప్రకటించింది.

వాతావరణ విభాగం హెచ్చరికతో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పునరావాస సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని ఆదేశించింది. భద్రాద్రి జిల్లాల్లో 15 సెంటిమీటర్ల వర్షపాతం  నమోదు అయింది.

You might also like