FbTelugu

నిర‌స‌న హింసాత్మ‌కంగా మార‌డం దుర‌దృష్ట‌క‌ర‌ం: మాయావతి

లక్నో: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిన్న దేశ వ్యాప్తంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. అయితే దేశ రాజధానిలో ఈ నిరసనలు హింసాత్మకంగా మారడం పట్ల బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావ‌తి ఖండించారు.

రైతుల నిరసనల్లో సుమారు 153 మంది పోలీసులు గాయ‌ప‌డడం పట్ల తీవ్రంగా స్పందించారు. ఈ ఘ‌ట‌న‌ను కేంద్రం సీరియ‌స్‌గా తీసుకోవాల‌న్నారు. కొత్త సాగు చ‌ట్టాల‌ను కేంద్రం త‌క్ష‌ణ‌మే విర‌మించుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు. తాజా హింసాత్మక ఘటనలపై పోలీసులు 15 కేసులు నమోదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.