FbTelugu

గణేష్ ఉత్సవాలను అడ్డుకోవద్దు: భగవంతరావు

హైదరాబాద్: కరోనా నిబందనలకు లోబడి జరుపుకుంటున్నగణేష్ ఉత్సవాలను అడ్డుకోవడం మంచిది కాదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ బద్దంగా వినాయక ఉత్సవాలు జరపడం మా హక్కు అని అన్నారు.

కరోనా ఎఫెక్ట్ తో గతేడాదితో పోలిస్తే 15శాతం విగ్రహాలు తగ్గాయనన్నారు. ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకున్నా.. పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితులోనూ వినాయకున్ని నిమజ్జనం చేసి తీరుతామని అన్నారు. ఇందుకోసం ఎప్పటిలాగానే ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సౌకర్యాలు కల్పించాలని కోరారు.

You might also like