FbTelugu

ఓటమి తప్పదనే ఐటీ దాడులు: రాహుల్

న్యూఢిల్లీ: తమిళనాడు లో భారీ ఓటమి తప్పదని గ్రహించిన బిజెపి ప్రభుత్వం డిఎంకె నాయకుల ఇళ్లపై ఆదాయపు పన్నుల శాఖతో సోదాలు చేయించిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

ఎన్నికల్లో ఓటమి ఎదురవుతున్న తరుణంలో బిజెపి ప్రభుత్వం ఉపయోగించే సిద్ధాంతం ప్రతిపక్షాలపై దాడులు చేయించడమేనని ఆయన ఆరోపించారు. డిఎంకె అధ్యక్షుడు ఎంకె.స్టాలిన్ అల్లుడు శబరీషన్ నివాసంతో పాటు పార్టీకి చెందిన నాలుగు ప్రాంతాల్లో ఐటి అధికారులు దాడులు నిర్వహించారన్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని, దివంగత నాయకుడు ఎం.కరుణానిధి కుమారడనని స్టాలిన్ ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.