FbTelugu

ఫ్లిప్ కార్ట్, స్విగ్గీ పై ఐటీ దాడులు

బెంగళూరు: బోగస్ ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ దాఖలు చేసిన ఫ్లిప్ కార్ట్, స్విగ్గీ డెలివరీ సంస్థలపై ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు సోదాలు జరిపారు. పన్ను ఎగవేతకు పాల్పడేందుకు బోగస్ ఇన్ పుట్ క్రెడిట్ పత్రాలు దాఖలు చేసినట్లు తేలడంతో ఇవాళ దాడులు నిర్వహించారు.

ఈ దాడులపై ఫ్లిప్ కార్ట్ సంస్థ స్పందించింది. ఐటీ అధికారులు అడిగిన సమాచారాన్ని అందచేశామని పేర్కొంది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది. బోగస్ ఇన్ పుట్ క్రెడిట్ పత్రాలు సమర్పించారన్న వార్తలను తొలుత ఖండించింది. ఫ్లిప్ కార్ట్ లాజిస్టిక్ యూనిట్ గా ఇన్ స్టాకార్ట్ పని చేస్తున్నది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం ఫిర్యాదుతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. స్విగ్గీ సంస్థల నుంచి కూడా రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.