FbTelugu

ఈబీసీ నేస్తం జీఓ జారీ

అమరావతి: ఏపీ ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు సాయమందించేందుకు ఈబీసీ నేస్తం జీఓ ను జారీ చేసింది. అగ్రవర్ణ పేదలకు కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
నిన్న జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో రూ.670 కోట్లతో ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదముద్ర వేసిందని సమాచార శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు.

45-60 ఏళ్ల ఈబీసీ మహిళలకు మూడేళ్లపాటు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందుతుందని ఆయన చెప్పారు. నవరత్నాల అమలు క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇదిలావుంటే మీసేవా, గ్రామ వార్డు, సచివాలయంలో ఈబీసీ కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో ఏవిధంగా దరఖాస్తు చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.