అమరావతి: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించారు.
రేషన్ కార్డు దారులకు ఉచితంగా బియ్యం సంచులను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అర్హులు నేటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది.