FbTelugu

వాహన మిత్రకు మార్గదర్శకాలు జారీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనికి సంబందించి ఉత్తర్వులను ఇవాళ జారీ చేసింది. ఈ పథకం కింద ఆటో, టాక్సీల డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందించనున్నారు.

గతేడాది వాహన మిత్ర కింద 2,36,344 మందికి లబ్ది చేకూరినట్టు తెలిపారు. గ్రామ వాలంటీర్లు, బిల్ కలెక్టర్ల వద్ద అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వచ్చేనెల 04 న అకౌంట్లలో నగదు జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

You might also like