FbTelugu

ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ జారీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఫొటో ఓటర్ల జాబితా సవరణకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.

పేర్ల నమోదు, మార్పులు, అభ్యంతరాల స్వీకరణకు నిర్ధిష్టమైన గడువును ఖరారు చేసింది. 2021 జనవరి 1 నాటికి సవరించిన ఫొటో ఓటర్ల జాబితా ప్రకటనకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై దరఖాస్తుకు అక్టోబర్‌ 31 వరకు గడువు విధించింది. సవరించిన ఓటర్ల జాబితాతో ముసాయిదాను నవంబర్‌ 16న ప్రకటించనున్నారు.
అభ్యంతరాలు, ఫిర్యాదులకు డిసెంబర్‌ 15 వరకు సమయం ఇచ్చింది. 2021 జనవరి 15న ఫొటో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్టు ఈసీ తెలిపింది.

You might also like