FbTelugu

రేపే ‘ప్రైవేట్‌’తో ఇస్రో తొలి ప్రయోగం

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో తొలి ప్రయోగానికి రెడీ అయ్యింది. మరి కద్ది గంటల్లో ప్రయోగానికి సుళ్లూరు పేట షార్ వేదిక కానున్నది.

ఈ నెల 28వ తేదీ ఉదయం 10.24 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ51తో తొలి అడుగు వేయనుంది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌ ద్వారా దేశంలోని ప్రైవేట్‌ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. మొత్తం 19 ఉపగ్రహాల్లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–1 ప్రధాన ఉపగ్రహం కాగా అమెరికాకు చెందిన స్పేస్‌ బీస్‌ పేరుతో 12 ఉపగ్రహాలు, సాయ్‌–1 నానో కాంటాక్ట్‌–2 అనే ఒక ఉపగ్రహంతో పాటు యూనిటీ శాట్‌ పేరుతో మూడు యూనివర్సిటీ విద్యార్థులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, సతీష్‌ ధవన్‌ శాట్, సింధునేత్ర అనే ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేసి సిద్ధంచేశారు. ఇవాళ ఉదయం 9.24 గంటల నుంచే కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు.
ప్రయోగం విజయవంతం కావాలంటూ ఇవాళ ఉదయం ఇస్రో చైర్మన్ శివన్ దంపతులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేంకటేశ్వర స్వామికి మొక్కులు సమర్పించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.