FbTelugu

ఏలియన్స్ పై ట్రంప్ తెగ ఉబలాటం

సంచలన వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ సైంటిస్టు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రహాంతరావాసులు (ఏలియన్స్) గురించి బాహ్య సమాజానికి తెలియచేయాలని బాగా ఉత్సాహం, ఉబలాటం కనబర్చేవారని, తమ గురించి చెప్పవద్దని అవి వారించాయని ఇజ్రాయెల్ మాజీ జనరల్ హైమ్ ఏషేద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జేరూసలేం పోస్టుకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రపంచంలోనే చర్చనీయాంశంగా మారింది. తమ విషయం ఇప్పట్లో బయటకు చెప్పవద్దని, గెలాక్సీ ఫెడరేషన్ లోని గ్రహాంతరవాసులు ఆయనను ఆపాయన్నారు. జనాలకు తమ విషయంల ఆసక్తి, ఆందోళన తగ్గుముఖం పట్టిన తరువాత వెల్లడించాలని కోరాయి. అవి మాస్ హిస్టీరియా సృష్టించాలని అనుకోవడం లేదు. తగినంత సమయం ఇచ్చి వారి పట్ల మనం తెలిపి, అవగాహన ఏర్పర్చుకోవాలని కోరుకుంటున్నాయని ఏషేద్ అన్నారు.
ఏరియా 51 ప్రాంతంలో అమెరికా సైన్యం గ్రహాంతరావాసులను బంధించి పెట్టిందని, వాళ్ల నుంచే అధునాతన టెక్నాలజీ ఆ దేశం పొందుతుందనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి బలం చేకూర్చే విధం హైమ్ ఏషేద్ వ్యాఖ్యలున్నాయి. భూమ్మీద మనతో కలిసి అవి తీరుగుతున్నాయని, వారు రహస్యంగా మన ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాయన్నారు.

ఇజ్రాయేల్, అమెరికా దేశాలు ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరావాసులతో కలిసి పనిచేస్తున్నాయని సంచలన విషయాలను ఏషేద్ వెల్లడించడం కలకలం సృష్టిస్తోంది. గ్రహాంతరవాసుల ఉనికి తాను నిరూపించగలనన్నారు.
అమెరికా ప్రభుత్వం, గ్రహాంతరావాసుల మధ్య ఒక ఒప్పందం ఉందన్నారు. ఇక్కడ ప్రయోగాలు చేయడానికి వారు అంగీకరించారు. వారు కూడా విశ్వ మొత్తం పరిశోధించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు మమ్మల్ని సహాయకులుగా కోరుకుంటున్నారని ఏషేద్ వెల్లడించారు. అంగారకుడి లోతులో భూగర్భ స్థావరం ఉందని, అక్కడ గ్రహాంతరవాసులు, మన అమెరికన్ వ్యోమగాములు ఉన్నారని ఆయన వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.