FbTelugu

రాష్ట్రాలకు ఐసోలేషన్ రైలు బోగీలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు కరోనా బాధితుల కోసం ప్రత్యేక రైలు బోగీలను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. పలు రాష్ట్రాలకు 960 ఐసోలేషన్ బోగీలను పంపనుంది.

ఢిల్లీకి 503 బోగీలు, ఉత్తర్ ప్రదేశ్ కు 372 బోగీలు, తెలంగాణకు 60 బోగీలు, ఆంధ్రప్రదేశ్ కు 20 బోగీలను పంపనున్నట్టు ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఐసోలేషన్ వార్డులు సరిపోకపోవడంతో రైల్వేశాఖ రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది.

You might also like