FbTelugu

ఇస్లామాబాద్ పేరు మార్చాలి

ఆన్ లైన్ లో ఒక వ్యక్తి పిటీషన్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్ పేరు సరిగా లేదని ఇస్లామాబ్యాడ్ అనే విధంగా ఉందని ఒక వ్యక్తి వాదన మొదలు పెట్టాడు. తన వింత పిటీషన్ ను పాకిస్థాన్ ప్రధానికి పంపించేందుకే సిద్ధమయ్యాడు.

ఇస్లామాబ్యాడ్ బదులు ఇస్లామాగుడ్ గా మార్చాలంటూ ఛేంజ్ ఓఆర్జీ డాట్ కామ్ లో పెట్టాడు. తన పిటీషన్ పై సంతకాలు చేస్తే పాక్ ప్రధానికి పంపిస్తానంటూ కోరాడు. ఇప్పటికే ఈ పిటీషన్ పై మూడు వందల మందికి పైగా సంతకాలు చేశారు. ఈ పని చేసింది ఆ దేశానికి చెందిన వ్యక్తి కాదు. శత్రు దేశమైన బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. బంగ్లాదేశ్ కు చెందిన అయ్ హమ్ అరార్ పిటీషన్ లో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. పాకిస్థాన్ ఇస్లామిక్ దేశం, ఇస్లాం ను ప్రేమిస్తుంది. అలాంటప్పుడు ఇస్లామాబాద్ ఇంగ్లీషు పేరు లో చివరణ బాద్ బదులు బ్యాడ్ ఉందని కొత్త వాదన తెరమీదకు తెచ్చాడు.

ఇది ఇస్లాం కు వ్యతిరేకం కావున ఇస్లామాబ్యాడ్ బదులు ఇస్లామాగుడ్ అనే పేరును పెట్టాలని పిటీషన్ లో అబ్రార్ కోరాడు. ఈ పిటీషన్ చూసిన ఒకరు ఇంగ్లీషు స్పెల్లింగ్ తెలుసా అని చురక అంటించాడు. ఇస్లామాబాద్ అనేది రెండు ఉర్ధూ పదాల కలయిక, ఇస్లామ్, ఆబాద్ అనే పదాలు వేర్వేరు అని వివరించాడు. ఆబాద్ అంటే ప్రదేశం… అంటే ఇస్లాం ఉండే ప్రదేశం అని స్పష్టం చేశాడు. దానర్ధం బ్యాడ్ కాదని హితబోధ చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.