FbTelugu

22న ఐసీస్ ఉగ్రవాదులకు శిక్ష ఖరారు

ఢిల్లీ: దేశములో ఉగ్ర కుట్రకు ప్రణాళిక వేసి మరో 9 మంది ఐసీస్ ఉగ్రవాదులను ఎన్ఐఎ స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చింది. డిసెంబర్ 2015 లో ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో మొత్తం 15 మందిపై నేరం రుజువైంది.
ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించి ఐసీస్ లో చేరేలా ప్రేరేపించిన 19 మందిని ఎన్ఐఎ 2015 లో అరెస్ట్ చేసింది.

సోషల్ మీడియా వేదిక గా ఐసీస్ కు యువకులను రిక్రూట్ చేసిన ఉధంతంలో దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. “జునోధ్ ఉల్ ఖిలాఫా ఫీల్ హింద్” పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి ఐసీస్ లక్ష్యాలను నెరవేర్చేందుకు 19 మంది ఉగ్రవాదులు కుట్ర పన్నారు. దేశంలో పేళ్లులకు భారీ కుట్ర రచించారు.

ఐసీస్ సానుభూతిపరులు దీనిపై హైదరాబాద్, బెంగళూర్ నగరాలతో పాటు మహారాష్ట్ర, యూపీలలో మీటింగ్ లు పెట్టుకున్నారు. సిరియాలో ఉంటున్న యూసఫ్ ఆల్ హింద్ అలియాస్ అంజన్ భాయ్ ఆదేశాలను అమలు చేయడం పనిగా పెట్టుకున్నారు. అంజన్ భాయ్ ఐసీస్ మీడియా చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. 2016-17 మధ్యలో ఈ కేసు లో 17 మంది పై ఎన్ఐఎ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 15 మందిపై నేరం రుజువైంది. ఎన్ఐఎ స్పెషల్ కోర్టు ఈ నెల 22 న శిక్ష ఖరారు చేయనున్నది.

You might also like