FbTelugu

ఆ చిత్రంలో డార్లింగ్ పాత్ర ఇదేనా!

హైదరాబాద్: ఆదిపురుష్ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ పాత్ర ఏంటో స్పష్టమైంది. సోషల్ మీడియా వేదికగా సినిమా పేరును ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులు మురిసిపోతున్నారు.
రిలీజు చేసిన పోస్టర్ లో ఆంజనేయుడితో పాటు రామాయణంలో కన్పించే పలువురు మునుల పాత్రలు ప్రతిబింబించేలా చిత్రాలు ఉన్నాయి.

వీటిని చూస్తే పౌరానికి చిత్రమేనని స్పష్టమవుతున్నది. పోస్టర్ లో ఉన్న ప్రభాస్ లుక్ ను పరిశీలిస్తే రాముడు పాత్రలో రక్తి కట్టిస్తారనేది అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రభాస్ ను రాముడి పాత్రలో చూసేందుకు జనం ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.

You might also like