FbTelugu

బాబు మాస్టర్‌ప్లాన్‌ ఇదేనా?

ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ హరిచందన్‌ బిశ్వభూషణ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అక్కడ రాజకీయ దుమారం రేపుతోంది. గవర్నర్‌ నిర్ణయాన్ని మెజారిటీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి రాజధానిని కాదని మూడు ప్రాంతాలను ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

దీనిపై అమరావతికి చెందిన రైతులు కూడా ఎప్పటినుంచో ఆందోళన చేస్తున్నారు. గవర్నర్‌ నిర్ణయంతో ఇప్పుడు వారంతా తమ ఆందోళనను మరింత ఉ«ధృతం చేస్తున్నారు. అయితే, గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీల్లో టీడీపీ ముందు వరుసలో ఉంది. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయి మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్‌ ద్వారా మార్గం సుగమం చేసుకోవడంతో ఆ పార్టీ ఈ విషయాన్ని జాతీయస్థాయిలో చర్చకు తేవాలన్న ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు సంఘాలు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.

ఈ విషయాన్ని మరింత చర్చనీయాంశం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఒక మాస్టర్‌ప్లాన్‌ వేసినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబునాయుడుతో పాటు టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఈ బాట పట్టారు. గవర్నర్‌ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే బాటలో టీడీపీ ప్రజాప్రతినిధులంతా నడిస్తే జాతీయస్థాయిలో చర్చ జరగడంతో పాటు వైసీపీ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని టీడీపీ అధినేత భావిస్తున్నారని, ఈ మేరకు త్వరలోనే ఆయన నిర్ణయాన్ని వెల్లడిస్తారని కూడా ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.