FbTelugu

కేసీఆర్ సంచలన నిర్ణయం ఇదేనా?

రైతులకు 45 ఏళ్ళకే పెన్షన్!

హైదరాబాద్: రైతాంగం కోసం ఇప్పటికే కొన్ని పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం త్వరలోనే వెల్లడించనున్నారు.

అది ఏంటా అని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతవారం జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, యావత్ దేశం తెలంగాణ వైపు చూసేలా నిర్ణయం ప్రకటించబోతున్నట్లు ప్రకటించారు.

కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించిన నాటి నుంచి దీనిపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రైతు బంధు పథకం కింద ఖరీఫ్, రబీ పంటలకు ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. సాగు చేసే రైతును ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పథకం విజయవంతం అయి టీఆర్ఎస్ ను  రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా వస్తున్న సమాచారాన్ని పరిశీలిస్తే ఆయన రైతులకు ప్రత్యేకంగా పెన్షన్ స్కీం ను ప్రవేశ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. 45 ఏళ్ళు దాటిన రైతులకు పెన్షన్ ఇవ్వాలి అని కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతినెలా రూ.3వేల వరకు పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే విధి విధానాలను ప్రకటించనున్నట్లు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది.

దీనితో పాటు ఇక నియంత్రిత పంటల విషయంలో కూడా ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నియంత్రిత పంటలను వేసిన రైతులకు రైతు బంధు ని మరింతగా ఇవ్వాలనే యోచనలో ఉన్నారు.ఇప్పుడిస్తున్న సాయానికి అదనంగా వారికి మరో రూ.2 వేలు పెంచనున్నట్లు సమాచారం. మొత్తానికి సీఎం కేసీఆర్ ప్రకటించే సంచలన నిర్ణయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

You might also like